Telangana Elections 2018 : స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా: గద్దర్ | Oneindia Telugu

2018-11-08 459

Gaddar has announced contesting from CM KCR’s Gajwel constituency as an Independent. Gaddar recently met Congress President Rahul Gandhi and Sonia Gandhi.
#Gaddar
#KCR
#GajwelConstituency
#telanganaelections2018

సీఎం కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటున్నారు ప్రజా నాయకుడు గద్దర్. గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌తో భేటీ తర్వాత మాట్లాడిన ఆయన.. తెలంగాణ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదన్నారు గద్దర్. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, సోనియాలను కలవం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో పల్లె పల్లెకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. మొదటి దశలో ఎస్టీ నియోజకవర్గాల పరిధిలో ఓటు పై చైతన్యం కల్పిస్తామన్నారు. రెండో దశలో ఎస్సీ నియోజకవర్గ పరిధిలో, మూడో దశలో బీసీలు, నాలుగో దశలో నిరు పేదల దగ్గరకు వెళ్తానని ప్రకటించారు.

Videos similaires